in

Nivetha Thomas reacts to a question about her over weight!

రెండేళ్ల తరువాత నివేదా థామస్ చేస్తున్న మూవీ 35-చిన్న కథ కాదు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో తాజాగా నివేదా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఆమె బరువు పెరిగి అందరిని ఆశ్చర్యపరిచింది..అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా జర్నలిస్ట్ ఉదాహరణకు అనుష్క బరువును ప్రస్తావిస్తూ బరువు పెరిగితే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అని ఇన్ డైరెక్ట్ గా నివేదా బరువు గురించి ప్రస్తావించింది. కానీ నివేదా ఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి నాదాకా మాత్రం రావు కేవలం మీదాకే వస్తాయి అని చెప్పుకొచ్చింది.

అయితే లేదు లేదు మీరు చూసి ఉండరు అనే లోపే 35 అనేది నా బరువు గురించి లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ల బరువు గురించి, ఈ సినిమాలో పని చేసిన వారితో పాటు స్టేజిపై ఉన్న ఎవరి బరువు గురించి కాదు అంటూ ఇచ్చి పడేసింది. దీంతో సదరు జర్నలిస్ట్ మళ్ళీ నోరు లేపకుండా సమాధానం ఇచ్చింది. అంటే ఇన్ డైరెక్ట్ గా తన బరువు అన్నది ఇక్కడ మేటర్ కాదని, సినిమా గురించి మాట్లాడితే చాలని చెప్పిందన్నమాట. అయితే నిజంగానే నివేదా అనుష్క లాగే బాగా బరువు పెరిగిపోయింది..!!

Love Mouli

Disha Patani’s ‘PD’ tattoo creates dating rumors with prabhas!