నిత్యామీనన్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి అసలు ఆలోచించదు. మరో స్త్రీకి ఆకర్షితురాలయ్యే పాత్రను ఆమె ‘అ’ సినిమాలో పోషించింది. రీసెంట్ గా అమెజాన్ లో రిలీజ్ అయిన బ్రీత్: ఇంటూ ది షాడోస్ అనే సిరీస్ లో నిత్య ఒక ఎపిసోడ్ లో లెస్బియన్ గా నటిస్తుంది. ఒక హత్య చేయడం కోసం శృతి బాప్నాపాత్ర లెస్బియన్ కనుక ఆమెను చీట్ చేయడం కోసం నిత్య కూడా అలా నటిస్తుంది. సదరు ఘట్టం రక్తి కట్టించడానికి వాళ్ళిద్దరి మధ్య లిప్ లాక్ సీన్ కూడా పెట్టారు.
ఇలాంటి సన్నివేశాలు మనకు చాలా అరుదు. పైగా నిత్య లాంటి ఇమేజ్ ఉన్న నటి చేయడంతో మరింతగా ఈ సీన్ ట్రెండ్ అవుతోంది. సదరు దృశ్యం నుంచి స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. క్యారెక్టర్ కోసం ఎంత బోల్డ్ గా అయినా నటించగలనని నిత్య నిరూపించింది. వెండి తెరపై నిత్య ఇంత బోల్డ్ గా చేయలేదు కానీ బహుశా ఈ సీన్ తర్వాత దర్శకులు ఆమెకు సవాళ్లు విసురుతారేమో..