టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తిగల విషయాలు చెప్పడం జరిగింది. తన తొలి ప్రేమ మీద..అలాగే తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు, వాళ్లలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో బైట పెట్టింది నిధి..పూర్తి వివరాలు కింద చదవండి.
”చిన్నతనంలోనే నా మదిలో ప్రేమ గంటలు మోగాయి. 4వ తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడిపై నాకు క్రష్ ఉండేది. అయితే అది ఆకర్షణ మాత్రమే అని తర్వాత అర్థమైంది. ఇప్పటికీ వాడు నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. కొంచెం పెద్దయ్యాక ఓ అబ్బాయితో డేట్‌కు వెళ్లా. నా తొలి వాలంటైన్ ప్రపోజ్ కూడా తన నుంచే అందింది. ఇంకో విశేషం ఏంటంటే.. అదే రోజు అతని పుట్టినరోజు కూడా. ఇక ఇప్పటి వరకు నాకు హార్ట్ బ్రేక్ అయింది మాత్రం ఒకే ఒక్కసారి. చిన్న చిన్నగా చాలాసార్లు అవుతూనే ఉంటుంది అనుకోండి (నవ్వుతూ). హీరోల్లో ఫస్ట్ క్రష్ మాత్రం షారఖ్ ఖాన్‌పైనే. ప్రస్తుతానికైతే నేను సింగిలే’’.
‘‘నాకు అబ్బాయిలు అసలొద్దు. నా దృష్టిలో బాయ్స్ అసలు మెచ్చ్యూర్డ్ కాదు. అందుకే నాకు రాముడు లాంటి మంచి మనిషి రావాలని కోరుకుంటా. ఇక సిక్స్‌ప్యాక్ రాముడైతే మరింత మంచిది. నన్ను చేసుకునే వాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని పెద్దగా కోరికలు లేవు. మంచిగా నవ్వించే వ్యక్తయితే చాలు. ఎవరితోనైనా డేట్‌కు వెళ్తా. ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక డ్రీమ్ ఉంది. నచ్చిన వ్యక్తితో మన ఇంట్లోనే ఉండాలి. చాలా సింపుల్‌గా ఇంటి భోజనమో, లేక జంక్ ఫుడ్డో తీసుకుంటూ హాయిగా టీవీ చూసుకుంటూ ఒకరికొకరం కబుర్లు చెప్పుకోవాలని కోరిక’’.