in

Nazriya Nazim lands in Hyderabad to shoot for Nani’s next!

నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ’ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలెట్టినట్లు హీరోయిన్‌గా నటిస్తోన్న నజ్రియా నజీమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. “అందరికీ నమస్కారం.. ఈరోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ముందుగా చేసే పని ఏదైనా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’ చాలా ప్రత్యేకం” అంటూ ఓ లేఖను పోస్ట్‌ చేసింది.

ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి…’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ‘టక్‌ జగదీష్‌’ సినిమా పూర్తికాగా, కరోనా వేవ్ తగ్గక థియేటర్లలోకి రానుంది. మరో సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్ దశలో వుంది.

Akhil Akkineni to join hands with ‘RX 100’ director!

allu arjun’s pushpa beats jr ntr’s bheem teaser record!