in

Akhil Akkineni to join hands with ‘RX 100’ director!

RX 100’ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ యువ దర్శకుడు ‘ఆర్ఎక్స్ 100’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా సాధించిన విజయం చూసి.. అజయ్ బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకున్నారు. ఐతే రెండో సినిమా పట్టాలెక్కించడానికి అతను చాలా టైమే తీసుకున్నాడు. రకరకాల కారణాల వల్ల ‘ఆర్ఎక్స్ 100’ రిలీజైన రెండేళ్లకు కానీ రెండో సినిమా ‘మహాసముద్రం’ను అతను మొదలుపెట్టలేకపోయాడు.

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో అజయ్ మూడో సినిమా ఉంటుందట. ఈ సినిమాకు హీరోగా వినిపిస్తున్న పేరు ఆశ్చర్యం కలిగించేదే. అక్కినేని అఖిల్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట. హీరోగా తొలి మూడు సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. అఖిల్‌కు అవకాశాలకేమీ లోటు లేదు. నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల కాకుండానే.. సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. దీని తర్వాత అతను అజయ్ భూపతి సినిమాకు కమిటయ్యాడట.

Samantha gifts a car to a Female auto driver kavitha!

Nazriya Nazim lands in Hyderabad to shoot for Nani’s next!