వరుస విజయాలతో దూసుకుపోతున్న నయన్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ఫుల్గా సాగుతున్నా పర్సనల్ లవ్ లైఫ్ లో రెండుసార్లు ఫెయిల్ అయింది. మొదట ఓ సినీ హీరోని ముందే వదిలించుకొని ప్రముఖ కొరియోగ్రాఫరును మాత్రం పెళ్లి పీటలెక్కే ముందు వదిలేసింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న నయన్ జీవితంలోకి ఈసారి డైరెక్టర్ వచ్చాడు.
అతనే విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటి నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఇటీవలే తను ఇంటర్వ్యూలలో ఎందుకు పాల్గొనదో కారణం చెప్పేసింది. “నా మనసులోని భావాలు ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదు. నేను కంప్లీట్ ప్రైవేట్ మనిషిని. అందుకే ఎక్కడా నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. కేవలం సినిమాల గురించి మాట్లాడతాను. ఇదివరకే పలుమార్లు మీడియా నా గురించి తప్పుగా రాసింది” అంటూ చెప్పుకొచ్చింది.