మందార పువ్వులతో చేసిన టీ అంటే తనకిష్టమని, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తి పెంపు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుందని పోస్ట్ పెట్టగా ఈ పోస్ట్ పై ఓ ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో ఓ డాక్టర్ పోస్ట్ పెడుతూ 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌కి నయనతార తప్పుడు సలహాలు ఇస్తోందని ఆవేశపడ్డాడు. ఇది వైరల్ అవటంతో నయన్ అనవసర ఆర్గ్యుమెంట్ ఎందుకని ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది.
ఆ మధ్య సామ్ కూడా నెబిలైజర్ గూర్చి పోస్ట్ చేసి డాక్టర్స్ విమర్శలకి గురి అయింది. కానీ వారికి ధీటుగా రిప్లై ఇచ్చి వారితో సారీ చెప్పించుకుంది. కానీ నయన్ మాత్రం ‘తెలివి తక్కువ వారితో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని క్రిందికి లాగి వారి స్థాయికి తీసుకెళ్తారు. వారి అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు’ అని అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్ చెప్పిన కొటేషన్ పోస్ట్ చేసింది. మొదట తగ్గి పోస్ట్ డిలీట్ చేసిన నయన తార మళ్ళీ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అని జోరుగా చర్చ నడుస్తోంది..!!