in

nani and nithin join hands for ‘Alias Rukmini’!

నేచరల్ స్టార్ నాని ఓ వైపు మూవీస్‌తో బిజీగా ఉంటూనే నిర్మాతగానూ మరో మూవీ అనౌన్స్ చేశారు. నితిన్ హీరోగా నాని సమర్పణలో డిఫరెంట్ లవ్ స్టోరీగా మూవీ రాబోతుండగా..’అలియాస్ రుక్మిణీ’ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రాజెక్ట్ ప్రారంభం కాగా..నాని వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ హైప్ క్రియేట్ చేస్తోంది..’దేని గురించి ఈ కథ?’ అంటూ నాని అడగ్గా..ఈ కథ కృష్ణ గురించి అన్న అంటూ హీరో నితిన్ రోల్ ఇంట్రడ్యూస్ చేశారు..

ఇంజినీరింగ్ బుక్స్ ముందేసుకుని పడుకునే హీరోని చూపిస్తూనే..ఆ వెనుక గరం గోపాల్, వ్రతం వెంకన్న, ఆమెకు ఆమె ఇష్టం అనే నవలలు చూపించారు. ‘వీటిని రాసింది రుక్మిణి’..ఇంతకూ ఆ రుక్మిణి ఎవరు? అనే ప్రశ్న ఎదురైతే..నా భార్య అంటూ నితిన్ చెప్పడం వెరీ స్పెషల్. రొమాంటిక్ నవలలు రాసే భార్యతో హీరో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. చూస్తుంటే ఓ డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది..!!

Shruti Haasan wants the protection of her personality, publicity rights!