in

Shruti Haasan wants the protection of her personality, publicity rights!

ప్రముఖ నటి శ్రుతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కుల పరిరక్షణను కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, ముఖాన్ని వాడుతున్న వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, AI డీప్‌ఫేక్ క్రియేటర్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.,

పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, హక్కుల ఉల్లంఘనపై వాణిజ్య దావా దాఖలు చేసేందుకు శ్రుతి హాసన్‌కు అనుమతినిచ్చింది. AI ద్వారా తన రూపంతో అశ్లీల చిత్రాలు, మార్ఫింగ్ వీడియోలు తయారుచేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ-కామర్స్ సైట్లు, బుకింగ్ యాప్‌లలో తన పేరు, బొమ్మలను వాణిజ్య ప్రచారాలకు వాడుకుంటున్నారని తెలిపారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి రక్షణ ఉత్తర్వులు పొందారు..!!

Keerthy Suresh reveals worked for 20 hours without sleep!