in

Mrunal Thakur Urges People To Name And Shame AI Misusers!

డీప్‌ఫేక్ కంటెంట్‌ను దుర్వినియోగం చేయడంపై ఇటీవలే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు ఆన్‌లైన్ వేధింపులపై మరో ముందడుగు వేశారు. సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి, వారి వివరాలను బహిర్గతం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో ఇతరులను వేధించే, AI సాయంతో సృష్టించిన లేదా అంగీకారం లేకుండా తీసిన వ్యక్తిగత చిత్రాలను పంచుకునే అకౌంట్ల వివరాలను ట్యాగ్ చేయాలని మృణాల్ కోరారు..

“ఇంటర్నెట్‌లోని ఈ మేధావుల కోసం ఓ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ నిర్మిద్దాం. వేధించే ఖాతాలను గుర్తిస్తే, వాటిని ట్యాగ్ చేయండి. ఇలాంటివి డాక్యుమెంట్ చేయడం చాలా అవసరం” అని తన పోస్టులో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే డీప్‌ఫేక్‌పై మృణాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. “నా ఫొటోలను ఉపయోగించి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించడం లేదా పంచుకోవడం చట్టవిరుద్ధం, ఆమోదయోగ్యం కాదు. దీన్ని అధికారిక హెచ్చరికగా భావించండి. నా గుర్తింపును ఇంకెవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని ఆమె స్పష్టం చేశారు..!!

nani and nithin join hands for ‘Alias Rukmini’!

Brett Lee Slams Preity Zinta Dating Rumors: 'Just Great Friends'

Brett Lee Slams Preity Zinta Dating Rumors: ‘Just Great Friends’