in

Nandamuri Balakrishna’s daughter Tejaswini to decide directors?

బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండా 2 సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో nbk109 త‌ర్వాత‌.. ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఈ క్ర‌మంలో బాలయ్య, దిల్ రాజు కాంబోలో మరో సినిమా సెట్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ట్రాక్ రికార్డ్ సృష్టించాడు.

అయితే సీనియర్ హీరోలైన చిరు, బాలయ్యతో మాత్రం ఆయన ఒక్క సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా పని చేయలేదు. ఈ క్రమంలో బాలయ్యతో భారీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలయ్య నటించే సినిమాలను తన చిన్న కూతురు తేజస్విని కూడా వింటున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్‌రాజు నిర్మాణంలో చేయబోయే సినిమా డైరెక్టర్‌ను కూడా ఆమె సెలెక్ట్ చేయబోతుందట. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ప్రశాంత్ వర్మ లేదా హరిష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు..!!

Raayan Telugu movie overall review

Bellamkonda Sreenivas adventurous film launched!