in

Naga Chaitanya and pooja Hegde to reunite again!

కప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం హిందీ సినిమాకు మాత్రమే పరిమితమైంది. కానీ రీసెంట్‌గా కోలీవుడ్‌లో ఒక సూపర్ ఆఫర్ అందుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా పూజా ఫైనల్ అయింది..ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్‌’ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాను చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది గీతా ఆర్ట్స్ బ్యానర్..

ఇక ఈ సినిమా తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఓ  సినిమా చేయబోతున్నాడు నాగ చైతన్య. మరో రెండు నెలల్లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించబోతుంది. ఈ సినిమాలోనే హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరు కలిసి ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించారు. అయితే.. ఈసారి పూజాకు ఇది సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి. అమ్మడిని తెలుగులో పట్టించుకునే వారే లేని సమయంతో.. చైతన్య ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ సినిమాతో పూజా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి..!!

Will Trivikram Srinivas join the 1000-crore club?

IMDb’s Top Indian Films Of 2024: ‘Kalki 2898 AD’