in

naga babu wanted to commit suicide!

న జీవితంలో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లుగా మెగా బ్రదర్ , నటుడు నాగబాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.. అందులో ఒకటి తన కుటుంబంతో కలిసి సెలవు యాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్ళామని అప్పుడు వరుణ్ తేజ్, నిహారిక చిన్నవాళ్ళు అని, ఆ సమయంలో తన కూతురు నిహారిక తప్పిపోయిందని నాగబాబు వెల్లడించారు.అయితే ఆ పర్యటనలో ఓక రోజు నిహారిక నేను అనుకుని నాలాగే డ్రస్ వేసుకున్న ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని అలా ఓ 20 నిమిషాల పాటు నిహారిక ఆచూకీ తెలియలేదని నాగబాబు చెప్పుకొచ్చారు..

నిహారిక కనిపించకపోవడంతో తనలో ఆందోళన మొదలైందని అన్నారు.. ఆ సమయంలో తన కుమారుడు వరుణ్‌ తేజ్‌ను ఇంటికి పంపించి.. నా భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టుగా నాగబాబు చెప్పుకొచ్చార..ఇక మరొకటి ఆరెంజ్ సినిమా ఘోరంగా ప్లాప్ అవ్వడం.. ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ సినిమా ప్లాప్ తో నాగబాబును తీవ్ర అప్పుల్లోకి చేరుకున్నారు.. దాని కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ అయన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆ సమయంలో సహాయం చేశారని నాగబాబు చెప్పుకొచ్చారు.

allu arjun’s song creates a sensational record!

akkineni samantha’s cars collection!