in

Mrunal Thakur opens up about her role in ‘Sita Ramam’!

నకు రాసిపెట్టి ఉంటే మనకే దక్కుతుందనేది సామెత. ఇది హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విషయంలో అక్షర సత్యం. సీతారామం సినిమాలో నటిస్తానని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఫోన్ కాల్ వచ్చింది. కాఫీషాప్ లో కలిసింది. హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఇదీ ఆమె అదృష్టం..ఎక్కడో హను రాఘవపూడి, ఈమె ఫొటోలు చూశాడంట. ఎలాగోలా కాంటాక్ట్ తెలుసుకొని కాల్ చేశాడట. ఈమెను కలవడం కోసం హను రాఘవపూడి ముంబై వెళ్లాడు. ఓ కాఫీ షాప్ కు రమ్మందంట. అక్కడే స్టోరీ నెరేట్ చేశాడు. ఆ కథ మృణాల్ కు బాగా నచ్చేసిందట. పూర్తిగా కథలో లీనం అయిపోయిందట.

అలా స్టోరీ చెబుతున్నప్పుడే మృణాల్ హావభావాలు చూసిన హను రాఘవపూడి, అక్కడికక్కడే ఆమెను సెలక్ట్ చేశాడట. అలా సీతారామం సినిమాలో అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది మృణాల్. తొలి తెలుగు సినిమాకే వైజయంతీ మూవీస్ లాంటి బ్యానర్ లో నటించే అవకాశం రావడం తన అదృష్టం అంటోంది. దుల్కర్ హీరోగా నటించిన సీతారామంలో 5 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందట మృణాల్. హీరోయిన్ రష్మికతో కాంబినేషన్ సీన్లు కూడా ఉన్నాయంట. అయితే, అదంతా ప్రస్తుతానికి సస్పెన్స్ అంటోంది..

kriti shetty to undergo surgery for her lips?

chaithu reacts to Sobhita Dhulipala’s name amid relationship rumours!