in

chaithu reacts to Sobhita Dhulipala’s name amid relationship rumours!

లాల్‌సిండ్‌చ‌డ్డా సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్నారు నాగ‌చైత‌న్య‌. ప‌లు చారిత్ర‌క సంఘ‌ట‌న‌ల‌కు సాక్షిగా నిలిచిన ఓ వ్య‌క్తి జీవ‌న ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు. హాలీవుడ్‌లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 11న హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది..

ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నాగ‌చైత‌న్య బిజీగా ఉన్నారు. కాగా మేజ‌ర్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌తో నాగ‌చైత‌న్య ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మేజ‌ర్స్ సినిమా రిలీజ్ స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన శోభిత దూళిపాళ్ల‌ను నాగ‌చైత‌న్య ప‌లుమార్లు క‌లిసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ డేటింగ్ రూమ‌ర్స్‌పై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగ‌చైత‌న్య తాజాగా స్పందించారు.

 

ఓ ఇంట‌ర్వ్యూలో శోభిత పేరు విన‌గానే మీకుగుర్తొచ్చేది ఏది అంటూ అడిగిన ప్ర‌శ్న కు చిరున‌వ్వు అంటూ ఫ‌న్నీగా ఆన్స‌ర్ చెప్పాడు నాగచైతన్య. ఆ పేరు విన‌గానే త‌న పెదాల‌పై న‌వ్వు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంద‌ని, అంత‌కుమించి మరేం గుర్తురాదంటూ పేర్కొన్నాడు. అత‌డి స‌మాధానం వెనుక ఉన్న ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది హాట్‌టాపిక్‌గా మారింది..కొత్త రూమర్స్ ఏవీ క్రియేట్ కాకుండా చాలా తెలివిగా చైతూ ఈ ప్రశ్నకు సమాధాచం ఇచ్చాడు. లాల్‌సింగ్‌చ‌డ్డా హిట్ అయితే భ‌విష్య‌త్తులో బాలీవుడ్‌లో మ‌రిన్ని సినిమాలు చేస్తాన‌ని అంటున్నాడు నాగ‌చైత‌న్య‌..

Mrunal Thakur opens up about her role in ‘Sita Ramam’!

Janhvi Kapoor opens up about chance to work with Jr NTR!