సైరా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు రూ. 40 కోట్లు అందుకున్నారట. తర్వాత కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారట. ఇందులో కాజల్ హీరోయిన్గా నటించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తండ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తమిళ స్టార్ అజిత్ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేశ్ ఈ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు. తెలుగువారికి కనెక్ట్ అయ్యేలా మార్పుచేర్పులు కూడా చేశారు. అయితే ఇందులో నటించేందుకు మెగాస్టార్ కళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకోనున్నట్లు వినికిడి. ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రూ.60 కోట్లకు ఫిక్స్ చేశారు. బాస్ సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయమన్న దీమాతో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మెగా పేమెంట్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట.