in

makers Massive planning for Tiger Nageswara Rao’s first look launch!

వితేజ నుంచి ఇటీవల వచ్చిన ‘రావణాసుర’ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. రవితేజ మార్క్ కి ఈ సినిమా చాలా దూరంగా వెళ్లిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి రావడానికి ‘టైగర్ నాగేశ్వరరావు’ రెడీ అవుతోంది. టైటిల్ తోనే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఈ నెల 24వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, ఫస్టు లుక్ నుంచి ఆ రేంజ్ ను చూపించనున్నారు. ఇటు సౌత్ ..అటు నార్త్ నుంచి ఐదుగురు సీనియర్ స్టార్ హీరోలతో ఫస్టులుక్ ను రిలీజ్ చేయించనున్నట్టు చెప్పారు. హిందీలో సల్మాన్ .. తమిళంలో రజనీ .. మలయాళంలో మోహన్ లాల్ .. కన్నడలో శివరాజ్ కుమార్ ఈ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు నుంచి ఏ స్టార్ అనేది తెలియాల్సి ఉంది. నుపుర్ సనన్ కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాను, అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు..!!

sreeleela is not balayya’s daughter!

Aishwarya Rajesh Says Her Comment About Srivalli Was ‘Misconstructed’!