దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న నయనతార లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.ఇక పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అవుతుందని చాలామంది భావించారు. అయితే అందరూ అంచనాలు తప్పంటూ ఈమె రెట్టింపు వేగంతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇలా సినిమా సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచుతూ తన క్రేజ్ ఏంటో నిరూపించుకుంటుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం నయనతార బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సరసన తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం తదుపరి సినిమా కోసం నయనతార తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ మామూలుగా లేదని చెప్పాలి.ఈమె తన తదుపరిచిత్రం కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్మనరేషన్ డిమాండ్ చేయగా నిర్మాతలు ఏమాత్రం నో చెప్పకుండా తను అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఈ విధంగా నయనతార 10 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా సౌత్ హీరోయిన్ ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశించడం ఇదే ఫస్ట్ టైమ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారాలుగా కొనసాగుతున్న దీపికా పదుకొనే అలియా భట్ వంటి హీరోయిన్లు మాత్రమే 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఆ హీరోయిన్లతో పాటు సమానంగా ఈమె కూడా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం…!!