in

kriti reveals the common thing between her and prabhas!

ప్రభాస్ కి మొహమాటం ఎక్కువని చాలామంది చెబుతుంటారని.. కానీ అతడితో పరిచయమైన తరువాత అవన్నీ తప్పని రుజువయ్యాయంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అంతేకాదు.. ఓ విషయంలో తను, ప్రభాస్ బాగా కలిసిపోయామని చెబుతోంది. ప్రభాస్ పెద్దగా మాట్లాడడు అని చాలామంది తనతో చెప్పారని.. కానీ తన విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందని చెప్పింది. మొదటిసారి ప్రభాస్ తో మాట్లాడినప్పుడు కాస్త మొహమాటంగా హాయ్ చెప్పారని..

ఆ తరువాత బాగా కలిసిపోయామని చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా మాటకారి అని.. చాలా సరదాగా ఉంటారని. మా ఇద్దరికీ ఓ కామన్ పాయింట్ ఉందని చెప్పింది. ప్రభాస్ ఫుడ్ బాగా ఇష్టపడతాడని.. తనకు కూడా ఫుడ్ అంటే బాగా ఇష్టమని.. బహుశా అదే మా ఇద్దరినీ దగ్గర చేసిందనుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇలా ప్రభాస్, తను బాగా కలిసిపోయామని చెబుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

Adah Sharma flaunts her assets in a newspaper-print outfit!

romantic Heroine Locked For Kartikeya’s Next!