in

romantic Heroine Locked For Kartikeya’s Next!

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలతో పాటు మీడియం బడ్జెట్, చిన్న చిత్రాలు నిర్మిస్తున్నారు. అలానే ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే అనుబంధ సంస్థలో చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ మూవీని నిర్మించి హిట్ అందుకున్నారు. కాగా ఇదే క్రమంలో ఇప్పుడు కార్తికేయతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ అనే దర్శకుడిని ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారట. ఇక ఇందులో కార్తికేయకి జంటగా రుహానీ శర్మ నటిస్తోందని సమాచారం. ఈమె ‘చి ల సౌ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ‘101 జిల్లాల అందగాడు’ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సరసన నటిస్తోంది.

kriti reveals the common thing between her and prabhas!

Iswarya Menon Pics: Vibes In Saree!