
రామాయణ’లో శూర్పణఖ పాత్ర పోషించిన హీరోయిన్ రకుల్‌ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా, తన పాత్ర గురించి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో ప్రధానంగా రెండు అంశాలు కనిపించాయి. ఒకటి సినిమా ద్వారా వచ్చిన అవకాశం, రెండోది శూర్పణఖ పాత్ర గురించి ఆమె అభిప్రాయం. “గ్లోబల్ ఆడియన్స్‌కు మన కల్చర్‌ను రిప్రజెంట్ చేసే అవకాశం రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది” అని రకుల్‌ప్రీత్ అన్నారు. ఈ సినిమాతో మన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ఆమె తెలిపారు..
భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు ప్రత్యేకంగా అనిపించిందని ఆమె మాటల సారాంశం. శూర్పణఖ పాత్ర గురించి కూడా ఆమె స్పష్టంగా మాట్లాడారు. ఆ పాత్రను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. ఆ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయని, అసలు యుద్ధం జరగడానికి ఆమే కారణమని రకుల్ పేర్కొన్నారు. అలాంటి క్యారెక్టర్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉందని ఆమె అన్నారు. కాగా, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ నవంబర్ 5న రిలీజ్ కానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు..!!

