in

keerthy suresh extra efforts for a revenge thriller series!

హానటి సినిమా వచ్చి ఐదేళ్లు గడుస్తుంది. అయినా, కీర్తిని ఇంకా మహానటి కీర్తి సురేష్ అనే పిలుస్తున్నారు. దీని తర్వాత కీర్తి సురేష్ చాలా సినిమాలు చేసింది. అందులో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ, ఏవీ కూడా మహానటి తీసుకువచ్చిన గుర్తింపును బీట్ చేయలేకపోయాయి. అయినా, కీర్తి ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా, ఇటు సిల్వర్ స్క్రిన్..అటు ఓటీటీ స్క్రిన్ పై కనిపించడానికి కష్టపడుతూనే ఉంది. ప్రస్తుతం కీర్తి  ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే..

అందులో రాధిక ఆప్టే కూడా కీ రోల్ చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఇప్పటికే వచ్చింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం..ఈ వెబ్ సిరీస్ గతంలో వచ్చిన వెబ్ సిరీస్ లకు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే కీర్తి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందట. అందుకు ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందని సమాచారం. ముఖ్యంగా రాధిక ఆప్టే – కీర్తి సురేష్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఇతర సీన్స్ కూడా ఆట్రాక్టివ్ గా ఉంటాయని, అవే వెబ్ సిరీస్ కు హైలైట్ అవుతాయని టాక్ వస్తుంది..!!

samyuktha menon finally comes out public after a gap!

rgv says bad news for bad guys!