in

rgv says bad news for bad guys!

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఈ చిత్రం ద్వారా వర్మ తెరకెక్కించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా తీసుకుని ‘వ్యూహం’ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం వాస్తవానికి నవంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది.

తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు వర్మ తెలిపారు. డిసెంబర్ 29న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ‘వ్యూహం’ సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను షేర్ చేశారు. ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్, వైఎస్ భారతి పాత్రను మానస రామకృష్ణ పోషించారు. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు..!!

keerthy suresh extra efforts for a revenge thriller series!

‘Death threat’ to Pooja Hegde after argument at Dubai club?