in

Kamal Haasan’s remuneration for prabhas Kalki 2898 AD!

ల్కి లో నటించిన కమల్ హాసన్ పారితోషికం గూర్చి ఒక ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కల్కిలో  విశ్వనటుడు కమల్ నటించటంతో సినీప్రియుల ఆసక్తి ఎక్కువ అయింది. ఈ మూవీలో కమల్ క్యారక్టర్ ఎలా ఉంటుందో, సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని ఉహాగానాలు మొదలయ్యాయి. ఈ మూవీలో  కమల్ హాసన్ క్యారక్టర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అది కూడా మూవీ ఆఖరిలో కమల్ కనిపిస్తారట.

అయినా గానీ ఆ పాత్ర మూవీకి హైలెట్ గా  నిలుస్తుంది అని, సెకండ్ పార్ట్ లో కూడా కమల్ పాత్ర కొనసాగుతుందని సమాచారం. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో కమల్ పాత్ర  నిడివి ఎక్కువ ఉంటుంది. మొదటి పార్ట్ లో కేవలం 20 నిమిషాలు కనిపిస్తారట. ప్రభాస్ తో అయితే  రెండు మూడు సీన్స్ లోనే కనిపిస్తారని తెలుస్తోంది. కానీ ఈ 20 నిమిషాల పాత్రకి కమల్ 10 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం..!!

VANISRI TO JAYA CHITRA!

Ravi Teja and Sreeleela to repeat dhamaka jodi?