
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలోనే టాలీవుడ్ తెరపై అడుగుపెట్టబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే టాలెంటెడ్ దర్శకుడు జయశంకర్ రూపొందిస్తున్న ఒక భారీ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో ఈ భామ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
గతంలో ‘పేపర్ బాయ్’ అలాగే ‘అరి’ వంటి విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ ఈసారీ ఒక సరికొత్త సస్పెన్స్ కథాకథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్న భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పాత్ర పూర్తిగా కొత్త కోణంలో కనిపించనుందని నిపుణులు చెబుతున్నారు. ఆమె కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రగా ఇది నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా మొదలుకానున్నట్లు సమాచారం అందుతోంది..!!

