in

Irumudi Box Office: Ravi Teja’s Biggest Career Opener Ever!

వితేజ, శివ నిర్వాణ కలసి అందించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 47.45 కోట్ల గ్రాస్ వసూలు చేసి రూ. 50 కోట్ల క్లబ్‌ వైపు వేగంగా దూసుకెళ్తోంది. సాధారణంగా భారీ యాక్షన్ చిత్రాలకు లేదా పాన్-ఇండియా సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే అరుదైన ఫీట్‌ను ‘ఇరుముడి’ సాధించింది. తెలంగాణలోని నైజాం ఏరియాలో ఆదివారం ప్రతి ఒక్క సెంటర్‌లోనూ సెకండ్ షోలు 100 శాతం హౌస్‌ఫుల్ అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, నల్ల బట్టలు, నుదుటన బొట్టుతో రవితేజ చూపించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

48 గంటల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే 100 కోట్లు గ్రాస్ సాధించిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తండ్రీకూతుళ్ల పవిత్రమైన అనుబంధం, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన గుండెలను తాకే సంగీతం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే మెజారిటీ ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 88% నుండి 100% ఆక్యుపెన్సీ నమోదు కావడంతో, ఈ చిత్రం మొదటి వారంలోనే రూ. 100 కోట్ల మైలురాయిని చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది..!!

COMEDY KING WITH GOLDEN HEART!

9 years for arjun reddy!