రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకునే పరిణితి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశాల పట్ల తనలో ఉన్న భయాలు తొలగిపోయాయని తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉందీ సుందరి. బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది. సినిమాల్లో అడుగుపెట్టడానికి ముందు నటనను గురించి తనకు తెలిసింది తక్కువేనని రాశీఖన్నా చెప్పింది.
ఆమె మాట్లాడుతూ ‘తొలి సినిమా ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చేవరకు నటనకు సంబంధించి నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ సీన్స్ పూర్తికాగానే వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. ఆ సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనిపించింది. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ పరిణతి వచ్చిన తర్వాతే నటనను ఆస్వాదించడం మొదలుపెట్టా’ అని తెలిపింది.