in

Ranabali and Jailer 2 to create a major box-office clash!

దసరా రేసులో పోటీ పడుతున్న రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్రాలు వాయిదా వార్తలను పక్కనపెట్టి తమ పనుల్లో వేగం పెంచాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానుందని సమాచారం ఉన్నప్పటికీ, బిజినెస్ డీల్స్ ఇంకా కొలిక్కి రాకపోవడం వల్ల కొంత సందేహం నెలకొంది. మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ‘రణబాలి’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది..

VFX పనులు తక్కువగానే ఉండటంతో అక్టోబర్ మొదటి వారంలో సెన్సార్ పూర్తి చేసి నాన్‌స్టాప్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఒక విధంగా సీనియర్ వర్సెస్ జూనియర్ ఫైట్‌గా మారింది. ‘జైలర్ 2’ కి సీక్వెల్ క్రేజ్, అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్లస్ పాయింట్లు కాగా, ‘రణబాలి’కి విజయ్ దేవరకొండ విభిన్న గెటప్, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం మరియు భారీ బడ్జెట్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అంచనాలు రెండింటిపై గట్టిగానే ఉన్నప్పటికీ, చివరికి ఏ సినిమా కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి..!!

happy birthday upendra!

bollywood star Riteish Deshmukh As Villain In Rapo 23!