in

vijay Devarakonda fulfills Indian Idol Fame Shanmukha Priya’s dream!

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లో ఫైనల్‌ వరకు వచ్చిన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ కలను అగ్రహీరో విజయ్‌దేవరకొండ నెరవేర్చారు. ఫైనల్‌ సమయంలో ఆమెకు మద్దుతునిచ్చిన విజయ్‌దేవరకొండ తన సినిమాలో పాట పాడే అవకాశమిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం షణ్ముఖప్రియతో ‘లైగర్‌’ సినిమాలో ఓ పాటను పాడించారు. అంతేకాకుండా షణ్ముఖప్రియతో పాటు ఆమె తల్లిని తన నివాసంలో కలిశారాయన. ‘ఇతరుల కలలను నిజం చేయడానికి మించిన ఆనందం మరొకటి లేదు.

‘లైగర్‌’లో షణ్ముఖప్రియ చక్కటి పాటను ఆలపించింది. ఆ పాట వినడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని విజయ్‌దేవరకొండ తెలిపారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మికౌర్‌, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. అనన్యాపాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నది.

raai laxmi at colors stardust award!

i felt embarrassed to act in romantic scenes : rashi khanna