in

hot sensation Yukti Thareja To Debut In Tollywood!

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. గ్లామర్ పరంగా ఆడియన్స్ ను అలరించారు. అయితే మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో, వాళ్లంతా తిరిగి తమ భాషా చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మరో బ్యూటీ తెరకి పరిచయం కావడానికి రెడీ అవుతోంది. ఆ సుందరి పేరే యుక్తి తరేజా. నాగశౌర్య హీరోగా ‘రంగబలి’ సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో కథానాయికగా యుక్తి తరేజా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ, తనకి మంచి పేరు తీసుకొస్తుందని యుక్తి తరేజా భావిస్తోంది. పవన్ సి హెచ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. జూన్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంత కాలంగా నాగశౌర్య వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి. ఇక యుక్తి తరేజా కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది…!!

Sreeleela Replaced Samantha In an international movie?

krithi shetty gets an another bumper offer!