in

Sreeleela Replaced Samantha In an international movie?

చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ ఎత్తుకు ఎదిగింది శ్రీలీల. నిన్న గాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేస్తోంది. ఆమె కాల్షీట్ల కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేయడానికి అంగీకరించిందంట శ్రీలీల..‘చెన్నై స్టోరీ’ అనే ఇంగ్లీష్‌ సినిమాలో శ్రీలీల నటించబోతోందట. నిజానికి ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత పేరు గట్టిగా వినిపించింది.

కానీ ఆమె స్థానంలో ప్రస్తుతం శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి, చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం రాబోతోంది. ఈ పాత్రకు శ్రీలీల అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. శ్రీలీలకు కూడా కథ బాగా నచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు ఆమె కాల్షీట్లు కేటాయించే పరిస్థితిలో లేదు..!!

Please leave my daughter, Keerthy Suresh’s father on rumors!

hot sensation Yukti Thareja To Debut In Tollywood!