in

krithi shetty gets an another bumper offer!

మిళ దర్శకుడు వెంకట్​ ప్రభు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కస్టడీ’ కృతి శెట్టికి ఆశించిన సక్సెస్​ ఇవ్వలేదు. దీంతో ఆమె నెక్ట్స్​ సినిమాపై సస్పెన్స్​ నెలకొంది. తాజాగా దర్శకుడు వెంకట్​ ప్రభు ఆమెకు రెండో ఛాన్స్​ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. కోలీవుడ్​ స్టార్​ హీరో దళపతి విజయ్​తో ఈ డైరెక్టర్​ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్​ ‘లియో’ షూటింగ్​ను ముగించే పనిలో ఉన్నాడు.

ఇది పూర్తవ్వగానే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడతారట. ఇందులో ఫీమేల్​ లీడ్​ కోసం కళ్యాణి ప్రియదర్శిని, నయన తార, మృణాల్ ఠాకూర్​ వంటి హీరోయిన్లు లిస్ట్​ లో ఉన్నారు. అయితే, విజయ్​ మాత్రం కృతి శెట్టి వైపే ఇంట్రస్ట్ చూపుతున్నాడని సమాచారం. ఈ సినిమా ఓకే  అయితే, బేబమ్మకి పర్ఫామెన్స్ కు  మంచి స్కోప్​ దొరికినట్టే. వచ్చే నెల 22న సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు..!!

hot sensation Yukti Thareja To Debut In Tollywood!

Gulshan Devaiah reveals he has a crush on Sai Pallavi!