in

HEROINE LAYA NU YEDIPINCHINA DIRECTOR!

బాలయ్య బాబు చెల్లెలి పాత్ర కోసం నటి లయ ను అప్ప్రోచ్ ఐన దర్శకుడు, విషయం విన్న లయ కంట నీరు పెట్టుకున్నారు. ఎందుకు? ఎవరా దర్శకుడు? లయ తెలుగు తనానికి నిలువెత్తు రూపం, శాస్త్రీయ నృత్యం ఆమె అదనపు ఆకర్షణ, ఆమెను చూసిన వారు ఎవరయినా మా అమ్మాయి అనుకునే విధంగా ఉండేది లయ . తళుకు బెళుకుల సినీ రంగం లో సౌందర్య ప్రదర్శన చేస్తేనే మంచి పాత్రలు వస్తాయి అనుకునే వారు, దానిని నమ్మే దర్శకులు ఎంతో మంది ఉన్నారు.యాక్టర్ కి కావలసింది నటన,సౌందర్య ప్రదర్శన కాదు అని నిరూపించిన, మహానటి సావిత్రి, ఆ తరువాతి తరం నటి వాణిశ్రీ,జయసుధ, సౌందర్య ఇప్పటి తరం నటి సాయి పల్లవి ఉన్నారు. ఉత్తరాది నటీమణులకు ఉన్న చొరవ, తెగువ, మన తెలుగు అమ్మాయిలకు ఉండదు,కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి అంటుంటారు. అందుకే వారిని దర్శకులు, చివరకు ప్రేక్షకులు కూడా కొన్ని పాత్రలకు పరిమితం చేసేసారు.

అందుకు ఉదాహరణే ఈ సంఘటన. దర్శకుడు వి.వి. వినాయక్ బాలయ్య బాబు తో నిర్మించిన ఫ్యాక్షన్ సినిమా ” చెన్నకేశవ రెడ్డి” ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ చేసారు, తండ్రి పాత్రకు, చెల్లెలి పాత్ర కోసం రామోజీ స్టూడియో లో షూటింగ్ లో ఉన్న లయ వద్దకు వెళ్లి అడిగారట వినాయక్. ఆ మాట వినగానే లయ ఏంటి సార్ మేము చెల్లెలు,అక్క,అమ్మ పాత్రలకే పని కి వస్తామా, హీరోయిన్ గ పనికి రామ? అని ఏడ్చేశారట. అదేమీ లేదండి ,మీరు అమాయకంగా ఉంటారు, ఆ పాత్రకు బాగా నప్పుతారు అని అడిగాను, తప్పుగా అనుకోకండి అంటూ వచ్చేసారు.ఆమె ఆవేదనలో నిజం లేక పోలేదు, అదే విధంగా దర్శక నిర్మాతల లెక్కలు వారికీ ఉంటాయి, ఇందులో ఎవరిని నిందించ వలసిన అవసరం లేదు. లయ రియాక్షన్ చూసిన తరువాత వినాయక్ గారు దేవయాని ని అప్ప్రోచ్ అవడం ఆమె ఆ పాత్ర అంగీకరించటం జరిగిపోయాయి. అలా లయ గారు బాలయ్య బాబు తో కలసి నటించే అవకాశం వదులుకున్నారు..!!

vijay opens up about ‘liger’ and ‘Amma Nanna Tamil Ammayi’!

Urfi Javed Accuses Man of Threatening Her to ‘Have Video Sex’!