శర్వాని పెళ్లాడనున్న అమ్మాయిది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తుంది. అయితే మొదట్లో శర్వాకి పెళ్లాడబోయే వధువు ఈమె అంటూ ఏవేవో లీక్స్ వచ్చాయి. అమ్మాయి ఎన్నారై అని, కాదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని, కాదు కాదు యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని ఇలా చాలా వార్తలు వచ్చినా అవన్నీ అవాస్తవాలే అని అంటున్నారు. శర్వా పెళ్లాడబోయే అమ్మాయి అసలు బ్యాక్ గ్రౌండ్ ఇదే అంటూ కొత్తగా వార్త ఒకటి సోషల్ మీడియూలో వైరల్ అవుతుంది. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి..ఈమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అట.
అంతేకాదు, చిత్తూరు (ప్రస్తుతం తిరుపతి) జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు..శ్రీకాళహస్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలని సమాచారం. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి..బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట. త్వరలోనే రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్లాడబోతున్నారట. శర్వానంద్ కి సంబంధం తెచ్చింది బాలయ్య అని కూడా రూమర్స్ ఉన్నాయి . మొన్న తన టాక్ షోకి గెస్టుగా వచ్చిన శర్వా క్యారెక్టర్ నచ్చి.. టీడీపీకి దేగ్గరైన బొజ్జల కుటుంబంతో బాలయ్య మాట్లాడి సెట్ చేసినట్టు ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..!!