in

film Manager Yella Reddy cheating in the Name of Anushka shetty!

సినీ నటి అనుష్క అపాయింట్ మెంట్ కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలంటూ నిర్మాతకు గాలమేసి మోసం చేశాడు ఓ మేనేజర్. ఇలాంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న రష్మిక మందన్న పేరుతో ఇలాంటి మోసాలే జరిగాయి. ఇప్పుడు ఓ అప్ కమింగ్ ప్రొడ్యూసర్ లక్ష్మన్ చారీని మోసం చేశాడు మేనేజర్ ఎల్లారెడ్డి. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లక్ష్మన్ చారీ నుండి 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ డేట్స్ ఇప్పిస్తామంటూ నిర్మాతను మోసం చేశాడట.

చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న నిర్మాత బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. తనను పలు మార్లు బెంగళూర్ తీసుకెళ్లాడని,  అక్కడ మోతి మహల్ హోటల్‌లో పలువురిని పరిచయం చేశాడట. చివరకు తాను ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానంటూ సదరు నిర్మాత తెలుసుకోవడంతో ఇలా న్యాయం కోసం పోలీసుల వద్దకు చేరుకున్నాడు. అంతకు ముందు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడంతో..మేనేజర్ ఎల్లారెడ్డిని ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దొరై మందలించాడట. అయినా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో..బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట..!!

happy birthday ravi teja!

hero Sharwanand is set to marry Rakshita Reddy!