in

Here’s the Truth Behind Car Accident Rumours!

యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్  రోడ్డు ప్రమాదానికి గురయ్యారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాక్సిడెంట్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిందని..ఈ రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ ఎడమచేతి యొక్క మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్టు పలు కథనాలు వెలువడ్డాయి.   ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ చికిత్స తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రోడ్డు ప్రమాదం గురించి ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎన్టీఆర్ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా కొద్ది రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అతని చేతికి కట్టు కట్టారు. గాయపడినప్పటికీ ఎన్టీఆర్ మంగళవారం రాత్రి దేవర షూటింగ్ ను పూర్తి చేశాడు. అయితే ఇప్పుడే చిన్నగా కోలుకుంటున్నాడు. రెండు వారాలు రెస్ట్ తీసుకోనున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే తిరిగి దేవర షూటింగ్ లో పాల్గొంటాడని.. ఇదే సమయంలో మణికట్టుకు ఆ చిన్న గాయం చూసి పలు ఊహగానాలు క్రియేట్ చేస్తున్నారు. వాటిని నివారించాలని అభ్యర్తిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు..!!

Dushara Vijayan: felt scared to work with Rajinikanth sir

samantha silence adding more fuel to the dating rumors!