
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఒకటి. ప్రస్తుతం ‘RC17’ వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రామ్ చరణ్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో రుక్మిణి వసంత్ మరో భారీ పాన్ ఇండియా సినిమాలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి నిజంగానే రుక్మిణి వసంత్ RC17లో హీరోయిన్‌గా ఎంపికవుతారా? లేక మరో హీరోయిన్‌కు అవకాశం దక్కుతుందా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది..!!

