in

hamsa and shraddha in big boss 4?

టాలీవుడ్‌లో మూడు సీజ‌న్స్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న‌బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్4. మరికొద్ది రోజుల‌లో  ప్రారంభం కానున్న ఈ షో మునుప‌టి మాదిరిగా వంద రోజులు కాకుండా కేవ‌లం 50 రోజులు మాత్ర‌మే జ‌ర‌గ‌నుంద‌ని టాక్. ఈ షోకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు వస్తున్నాయి. వీటిన బ‌ట్టి చూస్తుంటే ఈ సారి సీజ‌న్ 4లో లేడి భామ‌ల హ‌వా ఉంటుందా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.

రీసెంట్‌గా బిగ్ బాస్ సీజ‌న్‌4కి అక్కినేని కోడ‌లు స‌మంత హోస్ట్‌గా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌గా, తాజాగా ఇందులో పార్టిసిపేట్ చేసే హీరోయిన్స్ జాబితాకి సంబంధించి కొన్ని వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. వీళ్లలో ముంబై హాట్ గాళ్ శ్రద్ధా దాస్, తెలుగమ్మాయి యామిని భాస్కర్.. టాప్ మోడల్ కం నటి హంసా నందిని..  మరో తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని.. మోనా అనే మరో నటి ఉన్నారని తెలుస్తోంది. సీన్ చూస్తుంటే.. తొలి మూడు సీజన్లను మించి ఈసారి గ్లామర్ కంటెంట్ ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది. కాగా, ఇటీవ‌ల బిత్తిరి స‌త్తి బిగ్ బాస్ సీజ‌న్ 4కి ఎంపికైన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే..

Top 10 super hit movies of small screen that were flops on big screen!

anasuya consumes red wine daily!