వరుసగా ఫ్లాపులు రావడంతో గోల్డెన్ లెగ్ బుట్ట బొమ్మ కాస్తా, ఐరన్ లెగ్ బుట్ట బొమ్మ అయిపోయింది. తాజాగా తెలుగులో ఓ చిన్న సినిమాకి ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. ఓ చిన్న సినిమా అట అది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కి భిన్నంగా డిఫరెంట్ జోనర్లో ఆ సినిమా వుండబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాలో హీరో పాత్ర జస్ట్ అలా వుంటుందంతే. హీరోయిన్ చుట్టూనే కథంతా తిరుగుతుందట. డీ-గ్లామర్ లుక్ కాదుగానీ, పూజా హెగ్దేకి ఇది నిజంగానే చాలా కొత్త పాత్ర అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెలలో సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి..!!