మొదట్లో హీరోయిన్ నయన్‌తో ప్రేమలో మునిగి తేలిన ఈయన.. ఆమెతో బ్రేకప్ తర్వాత హన్సికతో ప్రేమాయనం నడిపాడు. ఇక ఇటీవల శింబు తండ్రి టీ. రాజేందర్ తన కొడుకుది ప్రేమ వివాహమే అవుతుందంటూ బహిరంగంగా వివరించాడు. ఈ క్రమంలో శింబు పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. నటి నిధి అగర్వాల్ తో ఎఫైర్ ఉందంటూ..వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 2021లో శింబు హీరోగా తెరకెక్కిన ఈశ్వరన్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అప్పటినుంచి డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు..తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారని.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్ నడుస్తుంది..!!