in

director teja wants kajal again!

ర్శకుడు తేజకి ఈమధ్యన కాజల్ ఓ దేవత లా కనబడుతుంది. ఎందుకంటే గతంలో లక్ష్మి కళ్యాణం తో కాజల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసి.. తర్వాత కాజల్ పెద్ద స్టార్ గా మారడానికి ఒకరంగా తేజ నే కారణం. అయితే తేజ కెరీర్ ప్రమాదపుటంచుల్లో ఉన్నప్పుడు కాజల్ కూడా తేజని నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఆదుకుంది. రానాతో కలిసి నటించిన ఆ సినిమా తో తేజ్ మల్లి దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. మళ్ళీ ఆ సినిమా హిట్ తర్వాత కాజల్ అగర్వాల్ తేజ తో సీత సినిమా చేసింది. ఆ సినిమా ప్లాప్.

తేజతో కాజల్ ముచ్చటగా మూడు సినిమాలు చేసింది. తాజాగా తేజ గోపీచంద్ తో అలివేలు వెంకటరమణ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో అలివేలు పాత్ర కోసం రకుల్ ప్రీత్, అనుష్క కీర్తి సురేష్ లా పేర్లు బాగా వినిపించాయి. అయితే తాజాగా తేజు మళ్ళీ కాజల్ దగ్గరే ఆగాడని.. ముందు కాజల్ ఎందుకులే అని అనుష్క, కీర్తి, రకుల్ పేర్లు పరిశీలించిన తేజ.. ఇప్పుడు వాళ్ళని కాదని కాజల్ పేరునే ఫైనల్ చేయబోతున్నాడని తెలుస్తుంది

top 10 Tollywood celebrities who passed away tragically young!

f cube ‘Raashi Khanna’!