in

Katrina Kaif Post-Pregnancy Trolling Sparks Internet Fury!

త్రినా కైఫ్ ఇటీవల తన శరీరాకృతిపై తీవ్రమైన ఆన్‌లైన్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ప్రసవం తర్వాత ఆమె రూపంలో వచ్చిన మార్పులపై కొందరు నెగెటివ్‌గా కామెంట్లు చేస్తుండగా..సహనటులు, అభిమానులు ఆమెకు అండగా నిలుస్తూ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. సహ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రిన.. కుమారుడు విహాన్ జన్మించిన తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. గత నెలలో ఓ ప్రార్థనా సమావేశానికి, ఇటీవల అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ ఉత్సవాలకు హాజరయ్యారు..

ఈ సందర్భంగా తీసిన ఫోటోలలో ఆమె బరువు పెరిగినట్లు కనిపించడంతో, సోషల్ మీడియాలో కొందరు ఆమెను టార్గెట్ చేశారు. ప్రెగ్నెన్సీకి ముందు, తర్వాత ఫోటోలను పోలుస్తూ ఆమె కెరీర్ ముగిసిపోయిందంటూ దారుణంగా కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై ఆమె సహనటులు స్పందిస్తున్నారు. ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ సినిమాలో కత్రినతో కలిసి నటించిన పాకిస్థానీ నటుడు అలీ జాఫర్, ఆమెకు మద్దతుగా ఒక వీడియో విడుదల చేశారు. “మహిళల పట్ల పురుషులు తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. ఆమెను బతకనివ్వండి, మీకేంటి బాధ?” అంటూ ట్రోల్స్‌కు గట్టిగా బదులిచ్చారు. నటి శివలీక ఒబెరాయ్ కూడా ‘ఇదే మాతృత్వం!’ అంటూ పోస్ట్ చేసి, తల్లయ్యాక శరీరంలో మార్పులు సహజమని పేర్కొన్నారు..!!

happy birthday meena!

Dimple Hayathi is set to fire up the stage and big screen again!