in

devarakonda’s heroine ananya pandey in love with Ishaan Khatter?

రుస సినిమాలతో బిజీగా మారిన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌నుంది. అయితే.. ఈ అందాల బామ సినిమాల‌తో పాటు ప్రేమ‌లో కూడా బీజీగా ఉంద‌నేది బాలీవుడ్ అంతా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ఈ ల‌వ్ ట్రాక్ న‌డుస్తోంద‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు కానీ.. పార్టీలు, పబ్ లు అంటూ చెట్టా ప‌ట్టాలు వేసుకొని తిరుగుతున్నార‌నే వార్త మాత్రం వైరల్ గా మారింది.

ఇక తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిని ఇషాన్ ఖట్టర్ తల్లి నీలిమా అజీమ్.. అనన్య మా ఫ్యామిలీ సర్కిల్స్ లో ఒకరు.. ఆమె నా కొడుకుకు మంచి సహచరురాలు అంటూ చెప్పింది. దీంతో వారి ప్రేమ వ్య‌వ‌హారాన్ని చెప్ప‌క‌నే చెప్పిందంటు వార్త‌లు వినిపిస్తున్నాయి. షాహిద్, మీరాతో కూడా ఆమె చాలా బాగా మాట్లాడుతోంద‌ని చెప్పింది. ఇంకేముంది కాబోయే కోడలు గురించి అత్తగారు ఇంత గొప్పగా పొగుడుతోంది.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుందని అభిమానులు కామెంట్ లు పెడుతున్నారు. మరి అనన్య ఈ విషయంపై ఎప్పుడు నోరువిప్పుతుందో చూడాలని నెటిజ‌న్ లు అంటున్నారు.

Surprise Pick by sukumar for Pushpa – The Rule!

Harshitha Panwar Showing Bare Back in Black Dress!