in

Surprise Pick by sukumar for Pushpa – The Rule!

పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఓ సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నాలతో విడుదలైన పుష్ప దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా భారీ కలెక్షన్లు చేస్తోంది. అటు పుష్ప పాటలకు స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా మేనియా వచ్చేసింది. అన్ని రంగాల్లో పుష్ప మేనియా స్పష్టంగా కన్పిస్తోంది. ఉత్తరాది బాక్సాఫీసును పుష్ప సినిమా ఊపేస్తోంది.

ఏ విధమైన ప్రమోషన్స్ లేకుండానే పుష్ప సినిమా బాలీవుడ్‌లో వందలకోట్లు వసూలు చేయడం విశేషం..పుష్ప సినిమా పార్ట్ 1 విజయంతో లెక్కల మాస్టారు సుకుమార్..పుష్ప 2 పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ సమయంలో పుష్ప రెండవ భాగం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2లో సీనియర్ నటి ఇంద్రజకు కీలకమైన పాత్ర ఆఫర్ వచ్చిందట. స్వయంగా దర్శకుడు సుకుమార్ ఈ ఆఫర్ ఇచ్చాడట. పుష్ప మొదటిభాగంలో అనసూయ పాత్రను మించి..పుష్ప రెండవ భాగంలో ఇంద్రజ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం ప్రస్తుతం ఇంకా నిర్ధారణ కాలేదు. సినిమా వీధుల్లో మాత్రం గట్టిగానే వైరల్ అవుతోంది.

can you guess the original movie names of these Telugu remakes!

devarakonda’s heroine ananya pandey in love with Ishaan Khatter?