in

Devara Trailer Faces trolls and Comparisons with Acharya!

ఎంతో మంది అభిమానులు చాలాకాలంగా ఎదురు చూసిన జూ.ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా ట్రైలర్‌ మంగళవారం రిలీజైంది. అయితే సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలను ఈ ట్రైలర్‌ బాగా నిరుత్సాహ పర్చింది. దీంతో కొరటాల శివ కేజీఎఫ్‌ పార్మాట్‌ లో ఈ సినిమా తీద్దామనుకున్నాడు..కానీ అది ‘ఆచార్య’లానే అయిందని పిస్తూందంటూ విూమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. గతంలో ‘ఆచార్య’ సినిమాలోని సన్నివేశాలను, ‘దేవర’ ట్రైలర్‌లోని సన్నివేశాలను కంపేర్‌ చేస్తూ మరీ ట్రోలింగ్‌ చెయడం విశేషం.

కొరటాల మాత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా తరహాలోనే ‘దేవర’ సినిమాను, ఎన్టీఆర్‌ పాత్రను డిజైన్‌ చేయటం బాలేదంటూ సోషల్‌ విూడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కొంతమంది ట్రైలర్‌పై తీవ్ర స్థాయిలో మండి పడుతూ ఇది మరో బచ్చన్‌ అవుతుందంటూ వీడియోలు చేసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. అంతేకాదు.. దేవరట్రైలర్‌ చూశాక, నిర్మాణ విలువలు భారీగా ఉన్నా..కంటెంట్‌.. ఏమాత్రం ఆసక్తికరంగా లేదని..ఎన్టీఆర్‌ కొరటాలకు ఛాన్స్‌ ఇచ్చి తప్పు చేశాడా అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ విూడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు..!!

Mahesh Babu invests in nutrition startup Fitday!

Rakul Preet singh: Lost many Films Due to Nepotism