in

December month Sentiment Continues For Allu Arjun!

ల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రాకా’ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక అల్లు అర్జున్‌కు బాగా కలిసొచ్చిన డిసెంబర్ సెంటిమెంట్ కూడా ఒక కారణమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అల్లు అర్జున్ కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ చిత్రం ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు నేషనల్ అవార్డును కూడా అందించింది. అలాగే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ కూడా డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. దీంతో డిసెంబర్ నెల అల్లు అర్జున్‌కు లక్కీ మంత్‌గా మారిందనే అభిప్రాయం అభిమానుల్లో బలపడింది..!!

Maa Inti Bangaaram!

Meenakshi Chaudhary Warns Fans About Fake Number Scam!