in

Meenakshi Chaudhary Warns Fans About Fake Number Scam!

మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని నకిలీ అకౌంట్లు సృష్టించడం, తద్వారా ఇండస్ట్రీ వర్గాలను, సాధారణ ప్రజలను మోసం చేయడం కేటుగాళ్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరు, చిత్రాలు, ఒక ఫోన్ నంబర్‌ను వాడుకుంటూ ఇండస్ట్రీలో మోసాలకు తెరలేపారు. అయితే ఈ విషయం కాస్తా నెటిజన్ల ద్వారా మీనాక్షి దృష్టికి వచ్చింది..

ఈ సైబర్ వ్యవహారంపై మీనాక్షి చౌదరి తక్షణమే స్పందించారు. తన పేరును తప్పుగా వాడుకుంటూ చలామణీ అవుతున్న ఆ నకిలీ వ్యక్తి గుట్టును సోషల్ మీడియా వేదికగా రట్టు చేశారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆ ఫేక్ నంబర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను షేర్ చేస్తూ..ఈ నంబర్ నుండి ఎవరికైనా కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే దయచేసి నమ్మకండి, అది నేను కాదు. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయండి అంటూ తన అభిమానులను, నెటిజన్లను కోరారు. అలాగే ఈ సైబర్ ఫ్రాడ్‌ను సకాలంలో తన దృష్టికి తీసుకువచ్చిన నెటిజన్లకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు..!!

December month Sentiment Continues For Allu Arjun!

Samantha and Raj Nidimoru are expecting their first child?

Samantha and Raj Nidimoru are expecting their first child?