in

dabang beauty in adivi sesh’s ‘major’!

యీ మంజ్రేకర్ నటించిన తొలిసినిమాతోనే యూత్ గుండె కొల్లగొట్టింది. సల్మాన్ లాంటి పెద్ద స్టార్ తో పోటీపడి నటించిందన్న పేరొచ్చింది. ఇక తనదైన అందచందాలు అభినయంతో ఈ అమ్మడు మ్యాజిక్ చేయడంతో అప్పట్లోనే టాలీవుడ్ ఎంట్రీపై చర్చ సాగింది. మహేష్ .. చరణ్ సినిమాల్లో నటించబోతోందని ప్రచారం సాగింది. ఎట్టకేలకు మహేష్ కాంపౌండ్ లోనే ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరం.

`మేజర్` చిత్రంలో సయీ మంజ్రేకర్ ఒక కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. 2008లో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరవీరుడైన ఎన్.ఎస్.జి కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం స్ఫూర్తితో తెలుగు- హిందీ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. దేశమంతా ఒకేసారి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.  ఇందులో గూఢచారి ఫేం శోభిత ధుళిపాల ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇదివరకూ 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది..

chay sam love story ku moola karanam hero mahesh babu!

KARTHIKEYA GETS A BUMPER OFFER IN KOLLYWOOD!