in

chay sam love story ku moola karanam hero mahesh babu!

నాగ చైతన్య, సమంత లవ్ స్టోరీ కి మూల కారణం హీరో మహేష్ బాబు గారు, అదేమిటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి మీరు కూడా ఎస్ అనే అంటారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్, మంజుల గారి ప్రోత్సాహం తో , ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని మహేష్ బాబు కు చెప్పారు, కధ చాల బాగుంది, కానీ మహేష్ బాబు ఏదైనా మంచి యాక్షన్ స్టోరీ ఉంటె చెప్పండి తప్పకుండ చేద్దాము అని చెప్పేసారు, గౌతమ్ మీనన్ తమిళ్ వెర్షన్ స్టార్ట్ చేసారు, మంజుల గారికి ఏమో ఆ కధ విపరీతంగా నచ్చింది, గౌతమ్ మీనన్ ను కలసి తెలుగు వెర్షన్ కూడా చేద్దాం అన్నారు, మరి హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్న, వెంటనే మంజుల గారు నాగ చైతన్య పేరు సజెస్ట్ చేసారు, గౌతమ్ మీనన్ కధ చెప్పటం నాగ చైతన్య ఓ.కే. చెప్పేసారు,

ఇప్పుడు సమస్య హీరొయిన్, కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనుకోని, వేట మొదలు పెట్టారు, అప్పటికే తమిళ్లో రెండు సినిమా లలో నటించటం మొదలుపెట్టిన కూడా, షూటింగ్ నత్థ నడక నడుస్తుండటం తో విసిగిపోయి ఉన్న సమంత తన ఫొటోస్ ను గౌతమ్ గారికి పంపించటం, ఆడిషన్ చేసి “ఎస్ ,శి ఈస్ మై జెస్సి” అనుకున్నారు డైరెక్టర్. సినిమాకు మంచి పోయటిక్ పేరు పెట్టాలి అనుకున్నారు, మహేష్ బాబు గారి సాంగ్” నువ్వేం మాయ చేసావో గానీ “లోనుంచి ” ఏం మాయ చేసావే ” టైటిల్ పుట్టింది. సినిమా పూర్తి అయింది, సూపర్ హిట్ అయింది, మరి సమంత ఏం మాయ చేసిందో కానీ నాగ చైతన్య పడిపోయాడు ప్రేమలో. ఇప్పుడు చెప్పండి నాగచైతన్య, సమంత ప్రేమకు బీజం పడింది ఎవరి వలన, మహేష్ బాబు గారి వల్లే అని మీరు కూడా ఒప్పుకుంటారు కదూ!

mama alludu to do movie again?

dabang beauty in adivi sesh’s ‘major’!