శ్రీలీల బేసిగ్గా సూపర్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందే డ్యాన్స్ వల్ల. ‘పెళ్ళి సందడి’ లాంటి పేలవమైన సినిమా కూడా బాగా ఆడిందంటే అందులోని పాటలు..హీరో హీరోయిన్ల అందం, ఆకర్షణ..వాళ్ల డ్యాన్సుల వల్లే. ముఖ్యంగా ‘యమునా నగరి’లో పాటలో శ్రీలీల డ్యాన్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. ‘ధమాకా’లో అయితే మాస్ డ్యాన్స్‌తో మంటలు పుట్టించింది శ్రీలీల. తర్వాతి రిలీజ్ ‘స్కంద’లోనూ శ్రీలీల డ్యాన్సులు ఒక రేంజిలో ఉంటాయని ప్రోమోలు చూస్తే అర్థమైంది..
మామూలుగా రామ్ మంచి డ్యాన్సర్. అలాంటి డ్యాన్సర్‌ను కూడా శ్రీలీల డామినేట్ చేసింది. ప్రోమోల్లో ఆమె అంతగా హైలైట్ అయింది. లేటెస్ట్గా ‘ఆదికేశవ’ నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. అందులో శ్రీలీలను చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టం. తన క్యూట్‌నెస్, హావభావాలు, అన్నింటికీ మించి మంచి ఈజ్‌తో ఆమె వేసిన స్టెప్స్ వారెవా అనిపించాయి. డ్యాన్స్‌కు స్కోప్ ఉన్న పాటలంటే చాలు.. పక్కన హీరో ఎవరున్నారో పట్టించుకోకుండా శ్రీలీలకు కనెక్ట్ అయిపోతున్నారు జనాలు. ఈ డామినేషన్ చూసి..ఈ అమ్మాయితో కష్టం అని హీరోలు అసూయ పడితే ఆశ్చర్యం లేదు..!!